
sankranti 2023 : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. సంక్రాంతి తెలుగువారి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన వైఎస్ఆర్ సీపీ కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.