వీడు తండ్రేనా : మూడేళ్లుగా కూతురిపై అత్యాచారం

Published : Jan 14, 2023, 08:18 AM IST
వీడు తండ్రేనా : మూడేళ్లుగా కూతురిపై అత్యాచారం

సారాంశం

పదమూడేళ్ల కూతురిపై తండ్రి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన విజయవాడలో వెలుగు చూసింది. దీంతో పోక్సో చట్లం కింద కేసు నమోదయ్యింది. 

విజయవాడ: వావివరుసలు మరిచిపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడు అన్నెం పున్నెం తెలియని కూతురిని కాటేశాడు. మూడేళ్ల పాటు కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. ఆ సంఘటన శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో వెలుగు చూసింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మాచవరానికి చెందిన వ్యక్తి ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు.

అతనికి ఇద్దరు కూతుళ్లు. అతని భార్య ఓసారి భర్త, పెద్ద కూతురి నగ్న చిత్రాలను చూసింది. దాని గురించి భర్తను ప్రశ్నించింది. అవి నిజమైన ఫొటోలు కావని అతను బుకాయించాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. ఆ తర్వాత అతను ఆ ఫొటోలను తీసేశాడు. 

టీడీపీ పసుపు, జనసేన ఎరుపు.. కలిస్తే కాషాయం.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

భర్త ప్రవర్తన సరిగా లేదని గ్రహించిన అతని భార్య ఇద్దరు కూతుళ్లను కూడా 2022 జులై నుంచి గన్నవరంలోని ఓ హాస్టల్లో చేర్చి చదివిస్తోంది. సెలవులు కావడంతో ఈ నెల 7వ తేదీన కూతుళ్లు ఇంటికి వచ్చారు. అయితే, పెద్ద కూతురు తండ్రికి దూరంగా ఉండసాగింది. దానికి ఆగ్రహించిన అతను ఆమెను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యను తిట్టాడు. తర్వాత కూతుళ్లు హాస్టల్ కు వెళ్లిపోయారు.

ఇద్దరు కూతుళ్లు కూడా తిరిగి 10వ తేదీన ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్యరం తండ్రి పెద్ద కూతురిని బ్యాంక్ పని ఉందని చెప్పి టూవీలర్ మీద తీసుకుని వెళ్లాడు. తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కూతురు తల్లి వద్దకు వెళ్లి తండ్రి తనపై చేసిన దురాగతం గురించి చెప్పింది.  బ్యాంక్ కని చెప్పి తీసుకుని వెళ్లి రామవరప్పాడు పైవంతెన దగ్గరలో గల నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. 

తాను ప్రతిఘటించడంతో ముళ్ల కర్రతో కొట్టాడని కూడా చెప్పింది. తనపై తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని కూతురు తల్లితో చెప్పింది. తల్లి, కూతురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పదమూడేళ్ల బాలిక తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!