సంగంలో ‘‘ప్రైవేటు’’ రగడ... తెరపైకి మరో కొత్త వివాదం, వదలబోమంటున్న యాజమాన్యం

By Siva KodatiFirst Published May 6, 2021, 4:59 PM IST
Highlights

ఏపీలో గత కొన్నిరోజులుగా రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన సంగం డైయిరీ వ్యవహారంలో మరో కొత్త వివాదం నెలకొంది. తనిఖీల పేరుతో బయటి వ్యక్తులను తీసుకురావడంపై యాజమాన్యం తీవ్ర అభ్యంతం వ్యక్తం చేస్తోంది

ఏపీలో గత కొన్నిరోజులుగా రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన సంగం డైయిరీ వ్యవహారంలో మరో కొత్త వివాదం నెలకొంది. తనిఖీల పేరుతో బయటి వ్యక్తులను తీసుకురావడంపై యాజమాన్యం తీవ్ర అభ్యంతం వ్యక్తం చేస్తోంది.

అంతేకాకుండా డైరీ కీలక డేటా ఉండే సర్వర్ల ఆపరేట్ విషయంలోనూ వివాదం నెలకొంది. మార్కెటింగ్ డేటా ఉండే సర్వర్ల విషయంలో బయటి వ్యక్తులకు యాక్సిస్ ఇవ్వడమేంటని సంగం డెయిరీ మండిపడుతోంది.

తనిఖీలు చేసేందుకు హైకోర్టు.. పోలీసులకు మాత్రమే అనుమతినిచ్చిందని వారు గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆ సర్వర్లను యాక్సెస్ చేస్తే డేటా చౌర్యం జరగొచ్చని సంగం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, ప్రైవేట్ వ్యక్తుల విషయంపై తాము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సంగం ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం తనిఖీలు చేయడానికి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు.

Also Read:ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్: ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు

కాగా, సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. 

నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

click me!