ఏపీలో ఎన్ 440కే పై గందరగోళం: సీసీఎంబీ ఏం చెప్పిందంటే

By Siva KodatiFirst Published May 6, 2021, 4:14 PM IST
Highlights

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రెండో వేవ్ తో ప్రజలు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడిందంటూ పెద్ద చర్చ జరుగుతోంది

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రెండో వేవ్ తో ప్రజలు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడిందంటూ పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ కొత్త వేరియంట్ భారతదేశంలో ఇప్పుడున్న అన్నింటికంటే 15 రెట్లు ప్రమాదకారి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

దీనిలో భాగంగా ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో గురువారం దీనిపై వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్, జులై‌లో ఈ స్ట్రెయిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్440కే వేరియెంట్ ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఈ రకం వైరస్‌ను చాలా తక్కువ‌గా గుర్తిస్తున్నామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశ నమూనాల నుంచి బి.1.617, బి1 రకాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీనిని గుర్తించామని ఆయన చెప్పారు. అయితే మిగిలిన వెరియేంట్‌లతో పోలీస్తే ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని జవహర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా యువతలో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Also Read:ఏపీ స్ట్రెయిన్‌పై రాద్ధాంతం.. అలాంటిదేది లేదు: తేల్చిచెప్పిన కోవిడ్ టెక్నికల్ కమిటీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కరోనా యొక్క 5 వేరియంట్లను సీసీఎంబీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్ మరియు ప్రైమరీ సోర్స్ దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న వివిధ వైవిధ్యాల వ్యాప్తిని వివరించింది. దీని ప్రకారం ఈ స్ట్రెయిన్ కర్నూలులో మొదట గుర్తించారు.

ఈ వైరస్ విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధాని సహా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఈ జాతిని మొదట గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది సామాన్య ప్రజలలో చాలా వేగంగా వ్యాపించింది.

కొత్త వేరియంట్‌తో బాధపడుతున్న రోగులు 3-4 రోజుల్లో హైపోక్సియా లేదా డిస్స్పనియాకు గురవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో, శ్వాస రోగి యొక్క ఊపిరితిత్తులకు చేరుకోవడం ఆగిపోతుంది.

సరైన సమయంలో చికిత్స అందించకపోవడం అలాగే, ఆక్సిజన్ మద్దతు లేకపోవడం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వైరస్ చైన్ సమయానికి విచ్ఛిన్నం కాకపోతే, ఈ సెకండ్ వేవ్ కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

click me!