చంద్రబాబు ఒక ఛాంపియన్: సంచయిత గజపతి రాజు సంచలనం

Published : Aug 12, 2020, 02:16 PM IST
చంద్రబాబు ఒక ఛాంపియన్: సంచయిత గజపతి రాజు సంచలనం

సారాంశం

చంద్రబాబు గారు మహిళల హక్కుల ఛాంపియన్ కానీ... అలా వెళ్లి అశోక్ గజపతి రాజుకి తనపై దాడి చేయొద్దని చెప్పండి అని సంచయిత అన్నారు. 

తండ్రి ఆస్తిలో కూతురికి కూడా సమన వాటా దక్కాల్సిందే అని అత్యున్నత న్యాయస్థానం తెలిపి విషయం తెలిసిందే. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులూ స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం దీనిని స్వాగతించాడు. 

ఆడబిడ్డలకు ఆస్తిలో సమన హక్కును నాలుగు దశాబ్దాల కిందటే టీడీపీ కల్పించిందని, ఆనాడు ఎన్టీఆర్ ఆడబిడ్డలకు సమన హక్కులు కావాలని ఆనాడే సంకల్పించారని అన్నారు. 

రాజకీయాల్లోనూ, చట్టసభల్లోనూ, విద్య, ఉద్యోగాల్లోనూ ఆడపిల్లలకు టీడీపీ ప్రాముఖ్యాన్నిచ్చిందని ఆయన గుర్తుచేశారు. స్వయం సహాయక సంఘాలు ద్వారా మహిళా సార్ధకతకు టీడీపీ కృషి చేసిందని ఆయన అన్నారు. 

ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూనే చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబు గారు మహిళల హక్కుల ఛాంపియన్ కానీ... అలా వెళ్లి అశోక్ గజపతి రాజుకి తనపై దాడి చేయొద్దని చెప్పండి అని సంచయిత అన్నారు. 

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ మొదటి మహిళా చైర్ పర్సన్ ని అయిన తనపై దాడి చేయొద్దని తన బాబాయి అశోక్ గజపతి రాజుకి చెప్పండంటూ విసుర్లు విసిరారు. తాను అశోక్ గజపతి రాజు అన్న కూతురినేనని, తాను కూడా వారసురాలినే అని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం