పశ్చిమగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు ఈ నెల 23వ తేదీ వరకు దర్శనాలను రద్దు చేశారు. స్వామివారికి ఏకాంతంగా సేవలను నిర్వహించనున్నారు.
అన్నవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు ఈ నెల 23వ తేదీ వరకు దర్శనాలను రద్దు చేశారు. స్వామివారికి ఏకాంతంగా సేవలను నిర్వహించనున్నారు.
అన్నవరం ఆలయంలో పనిచేసే అర్చకులు, ఇతర సిబ్బంది 39 మందికి కరోనా సోకింది. ఈ 39 మందిలో 10 మంది అర్చకులు ఉన్నారు. ఆలయంలో పనిచేసే 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 39 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది.
undefined
దీంతో ఈ నెల 23 తేదీ వరకు ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గని కారణంగా భక్తులకు ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకొంది.
అయితే స్వామివారికి యధావిధిగా సత్యదేవుడికి ఏకాంత సేవలను నిర్వహించనున్నట్టుగా ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఏపీలోని తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
త్వరలో నిర్వహించే టీటీడీ పాలకవర్గ సమావేశంలో భక్తులకు దర్శనం కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.