జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా సాంబశివ ప్రతాప్... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Aug 23, 2021, 04:39 PM IST
జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా సాంబశివ ప్రతాప్... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

సారాంశం

జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా ఈవన సాంబశివ ప్రతాప్ ను నియమితులయ్యారు. అలాగే కమిటీ వైస్ ఛైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు జిల్లా కమిటీల అధ్యక్షులను కూడా నియమించారు. 

విజయవాడ: జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పూనుకున్నారు. ఇందులోభాగంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలు, కేసులను ఎదుర్కొనేందుకు న్యాయ విభాగాన్ని ఏర్పాటుచేశారు. న్యాయపరంగ పార్టీ శ్రేణులకు సలహాలు, సూచనలు ఇస్తూ అండగా నిలిచేందుకే ఈ న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 

పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటయ్యింది. ఈ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా  ఈవన సాంబశివ ప్రతాప్ ను నియమించారు. ఈ విభాగం రాష్ట్ర కమిటీకి పవన్ కల్యాణ్ సోమవారం ఆమోదం తెలిపారు. వైస్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. వీరితోపాటు లీగల్ సెల్ జిల్లా కమిటీలకు అధ్యక్షులను కూడా నియమించారు.

లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్

ఈవన సాంబశివ ప్రతాప్

వైస్ చైర్మన్లు 

ఎ.వి.ఎన్.ఎస్.రామచంద్ర రావు 

వై.ఆర్.ఉదయ శ్రీ 

ప్రధాన కార్యదర్శులు 

కప్పెర కోటేశ్వర రావు 

కోసనం శ్రీనివాసరావు

 కె. శ్రీధర్ 

పిన్నాల శ్రీదేవి 

కార్యదర్శులు 

చిలుకూరి వీర్రాజు 

బి.చంద్రుడు 

ఎస్.సతీష్ బాబు 

వి.రమేశ్ నాయుడు 

డి.కె.మహాలక్ష్మి 

ఎన్.భరత్ బాబు 

టి.చంద్రశేఖర్ 

కె.అశోక్ కుమార్

లీగల్ సెల్ జిల్లా కమిటీల అధ్యక్షులు 

శ్రీకాకుళం –  డి.ఫల్గుణ రావు 
విజయనగరం –  డి.రాజేంద్ర ప్రసాద్ 
విశాఖపట్నం –  యర్రా రేవతి 
తూర్పుగోదావరి –  అడపా వెంకట సత్యప్రసాద్ 
పశ్చిమగోదావరి –  నిమ్మల జ్యోతి కుమార్ 
కృష్ణా –  పి.ఆర్.కె.కిరణ్ 
గుంటూరు –  నరెడ్ల హనుమంతరావు (అమ్మినాయుడు)
ప్రకాశం –  సుంకర సాయిబాబు 
నెల్లూరు –   సిహెచ్.రాజేష్ 
చిత్తూరు –  అలుగురి అమరనారాయణ 
కడప –  కరుణాకర రాజు 
కర్నూలు –  సి.వి.శ్రీనివాసులు 
అనంతపురం – జి.మురళీ కృష్ణ

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Powerful Speech: నా జోలికొస్తే ఊరుకోను నేను అన్నీ తెగించా | Asianet Telugu
Mangrove Initiative National Workshop: దేశం అంతటా ఈ వర్కుషాప్స్ నిర్వహిస్తాం | Asianet News Telugu