శిక్షణ కోసం వచ్చి సూసైడ్ చేసుకొన్నసఖినేటిపల్లి మహిళా ఎస్ఐ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు

By narsimha lodeFirst Published Aug 29, 2021, 12:17 PM IST
Highlights


పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సఖినేటిపల్లి ఎస్ఐ భవానీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నాటికే ఆమె ట్రైనింగ్ పూర్తైంది. ఇవాళ ఉదయం ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం: పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సఖినేటిపల్లి మహిళా ఎస్ఐ కె. భవానీ ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి ఎస్ఐగా భవానీ పనిచేస్తున్నారు. నేర పరిశోధన  నిమిత్తం  విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు ఆమె వచ్చారు. ఐదు రోజుల పాటు ఈ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకొన్నారు.

శనివారం నాడు మధ్యాహ్నానికి ఆమె శిక్షణ పూర్తైంది. ఆదివారం నాడు ట్రైనింగ్ సెంటర్ నుండి ఆమె వెళ్లిపోవాల్సి ఉంది.  ట్రైనింగ్ సెంటర్ లోని ఫ్యాన్ కు ఆమె ఉరివేసుకొంది.  ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ రాజోలు పోలిస్ స్టేషన్ లో శిక్షణ తీసుకొంది. ఆ తర్వాత ఆమెకు  సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం. శిక్షణ పూర్తైందని శనివారం నాడు తన సోదరుడికి ఆమె ఫోన్ చేసి చెప్పింది. ఇవాళ ఆమె తిరిగి తాను విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంది.ఈ సమయంలో  ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!