కట్టుకున్న వాడి కళ్లేదుటే మహిళపై చెయ్యేసి... పిడుగురాళ్లలో ఆటోవాలా వికృతచేష్టలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 29, 2021, 10:44 AM IST
కట్టుకున్న వాడి కళ్లేదుటే మహిళపై చెయ్యేసి... పిడుగురాళ్లలో ఆటోవాలా వికృతచేష్టలు

సారాంశం

తన ఆటోలో ప్రయాణిస్తున్న వివాహితతో ఆమె భర్త ఎదుటే అసభ్యంగా ప్రవర్తించాడో ఆటోవాలా. అంతటితో ఆగకుండా దంపతులను చితకబాదిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: కట్టుకున్న వాడి కళ్లేదుటే మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆటోవాలా. వివాహితను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటమే కాదు ఒంటిపై చెయ్యేస్తూ వెకిలిచేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా  మహిళ భర్తను చితకబాదారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

బాధిత దంపతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ గణేషునిపాడులో గల ఓ రంగుల మిల్లులో ఓ జంట పనిచేస్తోంది. వీరు సుందరయ్య కాలనీలో నివాసముంటూ ప్రతిరోజూ ఉదయం ఆటోలో మిల్లుకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే శనివారం కూడా ఓ ఆటోలో మిల్లుకు బయలుదేరారు.  

read more  ఎగిరెగిరి గుండెలపై తన్ని, తలను గోడకేసి బాది... స్టూడెంట్ ను చితకబాదిన కసాయి టీచర్

అయితే ఆటోవాలా ఈ దంపతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరు స్నేహితులతో  కలిసి భర్త ఎదుటే వివాహితను వేధించాడు ఆటో డ్రైవర్. వివాహితపై చేతులు వేస్తూ నీచంగా మాట్లాడారు. అడ్డుకోబోయిన భర్తపై దాడిచేసి జనాలు గుమిగూడగానే పరారయ్యారు. 

అయితే ఈ దంపతులు పనిచేసే మిల్లువద్దకు వచ్చి వివాహిత ఎదుటే ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో దంపతులు రక్షణకోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం నిందితులను పట్టుకోకుండా ఈ దంపతులనే జాగ్రత్తగా వుండమని చెప్పి పంపించేశారట. తమపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మూడు రోజులుగా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత జంట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu