చంద్రబాబు మానిక్యూలేటర్.. టీడీపీ మేనిఫెస్టో హామీలు దరిద్రంగా ఉన్నాయి: సజ్జల ఫైర్

Published : May 29, 2023, 02:30 PM ISTUpdated : May 29, 2023, 03:39 PM IST
చంద్రబాబు మానిక్యూలేటర్.. టీడీపీ మేనిఫెస్టో హామీలు  దరిద్రంగా  ఉన్నాయి: సజ్జల ఫైర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదని.. మానిక్యూలేటర్ అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన  కార్యదర్శి, ఏపీ  ప్రభుత్వ సలహాదారు విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదని.. మానిక్యూలేటర్ అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన  కార్యదర్శి, ఏపీ  ప్రభుత్వ సలహాదారు విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు దరిద్రంగా  ఉన్నాయని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సజ్జల ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అవినీతి, అరాచకరంలో కొత్త  రికార్డు  చేశాడని విమర్శించారు. వాటిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. 

చంద్రబాబు రాష్ట్రాన్ని సామాజికంగా దెబ్బతీయడం, అసమానతలు పెంచడం చేశారని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. గతంలో ప్రజలు ఇచ్చినా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో వచ్చిన చంద్రబాబు చేసిందేమి ఏముందని ప్రశ్నించారు. తాము ఇది చేశామని చెప్పుకుని ఓట్లు  అడుగుతున్నామని.. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏం లేవని మండిపడ్డారు. 

Also Read: జూ. ఎన్టీఆర్ తల్లిని తిట్టిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా?: కొడాలి నాని

చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న హామీలు కూడా దరిద్రంగా ఉన్నాయని విమర్శించారు. తాము అమలు చేస్తున్న హామీలను కూడా చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. జగన్ ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీల పరిస్థితేమిటని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu