రోడ్లను బ్లాక్ చేసి చంద్రబాబు మీటింగ్‌లు.. ఆయన సైకో అని ప్రజలకు అర్థమైంది: సజ్జల ఫైర్..

By Sumanth KanukulaFirst Published Dec 12, 2022, 2:06 PM IST
Highlights

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు‌పై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లిన రోడ్లను బ్లాక్ చేసి.. ట్రాఫిక్ ఉన్నచోట మాత్రమే మీటింగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు‌పై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లిన రోడ్లను బ్లాక్ చేసి.. ట్రాఫిక్ ఉన్నచోట మాత్రమే మీటింగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. సోమవారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లమీద కాకుండా చంద్రబాబు ఎక్కడైన గ్రౌండ్‌లో మీటింగ్ పెడుతున్నారా అని  ప్రశ్నించారు. ట్రాఫిక్ ఉన్నచోట నిలబడి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఆయన ఏదనుకుంటే అదే రూల్ అని భావిస్తున్నారని మండిపడ్డారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటంకు వచ్చినప్పుడు వాహనం టాప్ మీద ఎక్కి ప్రయాణించారని అన్నారు. ఆ బ్యాచ్‌ అంతా వారికి ఎలాంటి రూల్స్ ఉండవని అనుకుంటున్నారని విమర్శించారు. అలాంటివారు వైసీపీ‌ని ప్రశ్నించడం చూస్తే.. వారి స్వభావం ఏమిటో తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు‌లు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. పైత్యం ఎక్కువ అయిపోయి.. ప్రభుత్వంపై విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. సైకో ఎవరనేది చంద్రబాబు మాటలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబు సైకో అని ప్రజలు కూడా గుర్తించారని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయం అంటే  60 సీన్ల సినిమా అనుకుంటున్నారని విమర్శించారు. 

జగనన్న భూసర్వే వ్యక్తిగత అంశం కాదని.. సమాజంలో మార్పు కోసమేనని అన్నారు. అమరావతిలో ప్రజాజీవన విధానాన్ని టీడీపీ నాశనం చేసిందని ఆరోపించారు. కోవిడ్ సంక్షోభం లేకపోతే పరిస్థితి బాగుండేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా లబ్దిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అన్నారు. వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ వేతనం అని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో  ఆలోచన లేదన్నారు. 
 

click me!