
తెనాలి : ఓ వివాహిత ప్రియుడి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెనాలిలో కలకలం సృష్టించింది. భర్త ఇంట్లో లేని సమయంలో.. ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ ప్రియుడు, అతని తల్లితో గొడవ కావడంతో.. అతడి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెనాలి పట్టణంలోని ఐతానగర్ లో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. దీని మీద ఆదివారం నాడు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వ్యక్తిగత పనుల మీద ఆమె భర్త బెంగళూరుకు వెళ్ళాడు. ఇంట్లో అత్తమామలు ఉన్నారు. శనివారం రోజు స్కూలుకు వెళ్లిన పిల్లలకు భోజనం పెట్టి వస్తానని అత్తమామలకు చెప్పి వెళ్లిన వివాహిత.. విగతజీవిగా మారింది.
మృతురాలిని గాంధీనగర్ పయినీర్ అపార్ట్మెంట్ లో నివాసముండే పిన్నెల్లి గాయత్రి(33)గా గుర్తించారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆమె భర్త పని నిమిత్తం బెంగళూరు వెళ్ళాడు. ఇంట్లో అత్తమామలు, పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం స్కూలుకు వెళ్లిన పిల్లలకు భోజనం పెట్టి వస్తానని అత్తమామలకు చెప్పింది. నేరుగా తన ప్రియుడైన అంగలకుర్తి పవన్(24) ఇంటికి వెళ్ళింది. పవన్ ఐతానగర్లో ఎలక్ట్రీషియన్, హాల్టింగ్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి వివాహం కాలేదు. గాయత్రి, పవన్ కు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
ఆ రోజు గాయత్రీ పవన్ ఇంటికి వెళ్లిన సమయంలో అతడి తల్లి కూడా ఇంట్లోనే ఉంది. పవన్ గత కొద్దిరోజులుగా గాయత్రి ఫోన్ ఎత్తడం లేదు. మెసేజ్ లు పెట్టినా స్పందించడం లేదు. ఈ విషయం మీద గాయత్రీ పవన్ ను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం రేగింది. ఆ వివాదం కాస్త తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో పవన్, అతని తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ వెంటనే గాయత్రి ఇంట్లో లోపలి వైపు నుంచి గడియ వేసుకుంది. ఆ తర్వాత ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది.
ఏపీలో అన్నదాతలను నిండా ముంచిన మాండూస్ తుఫాన్.. పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు..
కాసేపటికి వచ్చిన పవన్ అతని తల్లి.. తలుపులు కొట్టినా ఎంతకీ తలుపులు తీయలేదు. దీంతో ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకుని పవన్, అతని తల్లి ఇంటి వెనక భాగానికి వెళ్లారు. అటునుంచి తలుపులు పగలగొట్టి చూడగా.. గాయత్రి లోపల ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో వెంటనే ఆమెను కిందికి దించి తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి భర్త శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.