ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Published : Dec 12, 2022, 12:37 PM IST
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

సారాంశం

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉంటున్నారు. అయితే బెయిల్ కోసం అనంతబాబు అనేక ప్రయత్నాలు చేశారు. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అక్టోబర్ నెలలో కొట్టివేసింది. ఈ క్రమంలోనే అనంతబాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!