సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) నిర్వహించిన చర్చలు ముగిశాయి. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరామని... 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కూడా కోరతామని ఆయన చెప్పారు. ఉద్యోగులు కోరుతోన్న విధంగా రేపు సీఎం ఫిట్ మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) నిర్వహించిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ సిఫార్సులు ఏవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవని చెప్పామన్నారు. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని... రేపు ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 34 శాతంకు తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరామని... ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ రావడం సహజంగా వస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ అంగీకరించమని చెప్పామని... తమ డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్తామని సజ్జల హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరామని... 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కూడా కోరతామని ఆయన చెప్పారు. ఉద్యోగులు కోరుతోన్న విధంగా రేపు సీఎం ఫిట్ మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
Also Read:పీఆర్సీపై ఏపీ సీఎస్ కమిటీ నివేదిక: ఉద్యోగ సంఘాల అసంతృప్తి
కాగా.. సీఎం జగన్‌కు సీఎస్ నేతృత్వంలోని కమిటీ సోమవారం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జగన్ మనసులో ఏముంది..? ఫిట్‌మెంట్ 30 శాతమైనా దాటుతుందా..? అన్న ఆందోళనలో వున్నారు. కేవలం 14 శాతం మాత్రమే ఫిట్‌మెంట్ సిఫారసు చేసింది సీఎస్ కమిటీ. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఫిట్‌మెంట్ విషయంలో కేంద్రాన్ని, ఇంటి అద్దె విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఫాలో అయినట్లుంది సీఎస్ కమిటీ. ఇంటి అద్దె విషయంలో గణనీయంగా తగ్గించింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం.
అంతకుముందు prc పై సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలు సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ Bopparaju సహా Employees Union నేతలు సోమవారం నాడు రాత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్కేల్ ను కమిటీ అధ్యయనం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. Chief Secretary నేతృత్వంలోని కమిటీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రకటించారు.