నారాయణకు సంబంధం లేకపోతే ఆయన కూతుళ్లను, అల్లుడిని అరెస్ట్ చేయవచ్చా..?: సజ్జల

Published : May 11, 2022, 02:03 PM ISTUpdated : May 11, 2022, 02:08 PM IST
నారాయణకు సంబంధం లేకపోతే ఆయన కూతుళ్లను, అల్లుడిని అరెస్ట్ చేయవచ్చా..?: సజ్జల

సారాంశం

మాల్ ప్రాక్టీస్ కేసులో ఉన్న ఆధారాలతోనే మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కాదా అని ప్రశ్నించారు. 

మాల్ ప్రాక్టీస్ కేసులో ఉన్న ఆధారాలతోనే మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కాదా అని ప్రశ్నించారు. ఆ విద్యాసంస్థలతో సంబంధం లేదని నారాయణ చెప్పగలరా అని ప్రశ్నించారు. నారాయణ అరెస్ట్‌కు సంబంధించి వ్యవహారంపై బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో నారాయణ విద్యా సంస్థల డీన్‌ బాల గంగాధర్ కన్పెషన్ స్టేట్‌మెంట్‌ను చదివి వినిపించారు. 

వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓ మాఫియా మాదిరి ఏర్పడి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష అనే ఎదురుదాడి ముసుగులో ఎంతకాలం తప్పించుకుంటారని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే వదిలేయాలా అని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ తప్పుకాదని టీడీపీ చెప్పగలదా..? అని మండిపడ్డారు.

విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఎద్దేశా చేశారు. కన్పెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నారాయణ విద్యాసంస్థలతో టెక్నికల్‌గా నారాయణకు సంబంధం లేకపోవచ్చు.. కానీ ఆయన చెబితేనే నేరం జరిగినప్పుడు అరెస్ట్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. నారాయణ‌కు టెక్నికల్‌గా సంబంధం లేదని చెబుతున్నారని.. మరి నారాయణ అల్లుడు చైర్మన్‌గా, కూతుర్లు డైరెక్టర్లుగా ఉన్నారని.. మరి వారిని అరెస్ట్ చేయవచ్చా..? అని ప్రశ్నించారు. అలా చేస్తే నోరు మూసుకుంటారా అని ప్రశ్నించారు.

ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. ఇలాంటి నేరాలపై కఠినంగా ఉండేందుకే జగన్ ప్రభుత్వం ఉంటుందన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లేది చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి నేరాలు చేయాలని అనుకునేవారికి భయం పుట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!