పవన్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో.. సజ్జల

By telugu news teamFirst Published Oct 2, 2021, 4:14 PM IST
Highlights

 కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు  పవన్ రాజమండ్రిలో శ్రమదానం, బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..  పవన్ అసలు  ఏం నిరూపించుకోవాలని అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదంటూ సజ్జల పేర్కొన్నారు.

శనివారం ఆయన మీడియాతో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా? అని ప్రశ్నించారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నవంబర్‌ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజమండ్రి పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన బహిరం సభ కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తర్వాత అనుమతి ఇవ్వడం గమనార్హం.

click me!