బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సాదినేని యామిని శర్మ

Published : Feb 01, 2021, 09:32 AM IST
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సాదినేని యామిని శర్మ

సారాంశం

అమరావతి : టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాదినేని యామిని శర్మ కు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పదవికి కట్టబెట్టింది. ఈ మేరకు నియామక పత్రం విడుదల అయ్యింది. 

అమరావతి : టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాదినేని యామిని శర్మ కు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పదవికి కట్టబెట్టింది. ఈ మేరకు నియామక పత్రం విడుదల అయ్యింది. 

బీజేపీ మహిళా మెర్చా రాష్ట్ర కార్యదర్శిగా సాదినేని యామిని శర్మను నియమిస్తున్నట్టు  మహిళా మోర్చా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మలా కిశోర్‌  నియామక పత్రం విడుదల చేశారు.  

టీడీపీలో ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న యామిని గత ఏడాది జనవరిలో బీజేపీలో చేరారు. ఆ తరువాత హిందూ ఆలయాల విధ్వంసం ఘటనలను నిరశిస్తూ సాగిన ఆందోళనల్లో చురుగ్గా పాలుపంచుకొన్నారు.

సాదినేని యామిని శర్మ ఒకప్పటి టిడిపి ఫైర్ బ్రాండ్, అధికార ప్రతినిధిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి చవిచూడడంతో వెంటనే యామిని ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికే కాదు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇలా టిడిపికి  దూరమైన ఆమె ఏ పార్టీలో చేరకపోయినా బిజెపిలో చేరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పలుమార్లు ఆమె ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడమే ఈ అనుమానాలకు కారణమయ్యాయి. 

అయితే అందరూ అనుకున్నట్లే ఎట్టకేలకు యామిని కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్న కేంద్ర  మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు ఇతర బిజెపి పెద్దల సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ఆమెకు పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి చేర్చుకున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో యామిని టిడిపి తరపున పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. టీవి డిబేట్స్ లో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలు వైసిపి, జనసేనలపై విరుచుకుపడ్డారు. ఓ దశలో టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు కూడా ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదు.  పార్టీ అభ్యర్థుల తరపున మాత్రం ఆమె విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. 

అయితే ఈ స్థాయిలో కష్టపడ్డా టిడిపి ఓటమి చవిచూడటంతో యామిని ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయారు.  ఆమె బిజెపిలో చేరి  మరో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే చేరిన తరువాత సంవత్సరానికి క్రియాశీలంగా ఓ పదవిలోకి వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu