సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ సంఘాలు

By telugu teamFirst Published May 22, 2019, 9:54 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమౌతున్నారు. ఆర్టీసీలో కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారంతో పాటు వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమౌతున్నారు. ఆర్టీసీలో కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారంతో పాటు వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సమ్మె చేపట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. 

డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెకు సిద్ధమంటూ ఈనెల 8, 9వ తేదీల్లో ఎన్‌ఎంయూ, ఈయూ నేతృత్వంలో జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు.  దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యు.హనుమంత రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌తో పాటు కార్మిక పరిషత్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ యూనియన్‌, వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్‌లు జతకట్టాయి.

ఆయా సంఘాలన్నీ బుధవారం రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్‌ఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు హను మంతరావు ప్రకటించారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమ, మంగళవారం రెండు రోజులు డిపోల్లో ధర్నాలు నిర్వహించి నిరసన తెలియజేశారు.

click me!