రైట్ రైట్: తొలిగిన అడ్డంకి, ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు షురూ...

By Sreeharsha GopaganiFirst Published Jun 19, 2020, 7:56 AM IST
Highlights

రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణాలో ఏపీ బస్సులకు ఎన్ని కిలోమీటర్లు తిరిగే అవకాశం కల్పిస్తే... అన్నే కిలోమీటర్లు ఏపీలో తెలంగాణ బస్సులు తిరుగుతాయని ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి సర్వీసులు ప్రారంభించే విషయానికి సంబంధించి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు ముగిశాయి. 

రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణాలో ఏపీ బస్సులకు ఎన్ని కిలోమీటర్లు తిరిగే అవకాశం కల్పిస్తే... అన్నే కిలోమీటర్లు ఏపీలో తెలంగాణ బస్సులు తిరుగుతాయని ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు. 

త్వరలో మరోసారి ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై ఒప్పందంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలియవస్తుంది. ఏది ఏమైనా... వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ మధ్య బస్సులను ప్రారంభించాలని మాత్రం అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. 

అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని, రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్  స్టార్ట్ చేయాలని నిర్ణయానికొచ్చామని ఏపీ ఎస్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి సమావేశం అనంతరం విలేఖరులకు తెలిపారు. 

తొలుత 256 సర్వీసులు ఏపీ నుంచి తెలంగాణకు నడపాలని నిర్ణయించి తెలంగాణ అధికారులకు ఇందుకు సంబంధించి ప్రపోసల్ పంపించామని, వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. 

కిలోమీటర్ ప్రాతిపదికగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని, కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామని స్పష్టం చేసారు. 

స్టేట్ అగ్రిమెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు చర్చ జరగలేదని, అవకాశం వచ్చింది గనుక ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చ జరిపామని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. 

click me!