ఏపీలో నేడే రాజ్యసభ ఎన్నికలు: ఓటేసిన సీఎం వైఎస్ జగన్

Published : Jun 19, 2020, 07:27 AM ISTUpdated : Jun 19, 2020, 10:41 AM IST
ఏపీలో నేడే రాజ్యసభ ఎన్నికలు: ఓటేసిన సీఎం వైఎస్ జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఓటింగ్ అనివార్యంగా మారింది. టీడీపీ తరఫున వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. టీడీపీ నేత వర్ల రామయ్య పోటీలో ఉండడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  

ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత. కౌంటింగ్ జరుగుతుంది.  ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా  మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పోటీలో ఉన్నారు. 

టీడీపీ నుంచి బరిలో ఉన్న వర్ల రామయ్య ఉన్నారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు వేశారు. ఆయన అక్కడ అందరినీ పలకరించడం కనిపించింది. 

తమకు తగిన బలం లేనప్పటికీ వర్ల రామయ్యను టీడీపీ నాయకత్వం పోటీకి దింపింది. సీఎం వైఎస్ జగన్ పరిపాలన తీరును నిరసిస్తూ పోటీకి దిగినట్లు చెబుతున్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. 

వారిద్దరు కూడా ఏపీ శాసన మండలి సభ్యులు. శాసన మండలిని రద్దు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించడంతో వారిని రాజ్యసభకు పంపించాలని జగన్ నిర్ణయించారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్