తుఫాను ఎఫెక్ట్.. భారీ వరదల్లో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

By telugu news teamFirst Published Nov 27, 2020, 10:59 AM IST
Highlights

నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సోమశిలకి పైఎత్తు నుంచి భారీగా  వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది.

నివర్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగానే పడింది. ఈ తుఫాను కారణంగా వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి.  కాగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తిప్పవారిపాడు వద్ద వరదల్లో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని ప్రయాణికులను రోప్ ద్వారా రక్షించారు. సహాయకచర్యలను కలెక్టర్‌ గోపాలకృష్ణ, అధికారులు  పరిశీలించారు. గూడూరు రూరల్‌ తిప్పవరపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది.

నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సోమశిలకి పైఎత్తు నుంచి భారీగా  వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. దీంతో అధికారులు 1,70,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో ఉండిపోయాయి. కలకత్తా - చెన్నై జాతీయరహాదరిపై 50 కిలోమీటర్ల దూరం మేర  వాహనాలు నిలిచిపోయాయి.  నిన్న సాయంత్రం నుంచి ఆహారం, తాగునీరు లేక  వేలాది మంది ప్రయాణికులు అల్లాడుతున్నారు. 

click me!