నేడు ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Nov 27, 2020, 10:25 AM IST
Highlights

ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

అమరావతి: ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.ఈ సమావేశాల్లో అనుససరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

నివర్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో జరిగిన నష్టంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమౌతోంది. అయితే కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ససేమిరా అంటుంది.ఈ విషయమై కూడా చర్చించనున్నారు.  పోలవరం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు విషయాన్ని కేబినెట్ లో చర్చించనున్నారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని వైసీపీ నిర్ణయించింది. డిసెంబర్ 25 న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ విషయమై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు ఇతర అంశాలపై  కూడా మంత్రివర్గం చర్చించనుంది.

అసెంబ్లీలో విపక్షానికి కౌంటర్ ఇచ్చే వ్యూహంపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.  రాష్ట్రంలో నివర్ తుఫాన్ తో పాటు అక్టోబర్ మాసంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్ని పంటలకు పరిహారం విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షం సిద్దమౌతోంది. అయితే విపక్షాన్ని కౌంటర్ చేసేందుకు అధికార పక్షం కూడా అదే స్థాయిలో సిద్దమౌతోంది.

ఈ నెల 30 నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.


 

click me!