వీరవాసరం పోలీస్‌స్టేషన్ లో రూ. 8 లక్షల నగదు మాయం: ఉన్నతాధికారుల సీరియస్

Published : Mar 17, 2021, 01:58 PM IST
వీరవాసరం పోలీస్‌స్టేషన్ లో రూ. 8 లక్షల నగదు మాయం: ఉన్నతాధికారుల సీరియస్

సారాంశం

 పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో రూ, 8 లక్షల నగదు చోరీకి గురికావడం చర్చకు దారితీసింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో రూ, 8 లక్షల నగదు చోరీకి గురికావడం చర్చకు దారితీసింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుసగా బ్యాంకులకు సెలువు లు రావడంతో ఎక్సైజ్ పోలీసులు వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో రూ. 8 లక్షల నగదును దాచారు.నాలుగు వైన్ షాపులకు సంబంధించిన నగదు రూ. 8లక్షల నగదును వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో దాచారు. అయితే ఈ నగదు కోసం వచ్చిన ఎక్సైజ్ పోలీసులకు షాక్ కు గురైంది.

రూ. 8 లక్షల నగదు కన్పించకుండాపోయింది.ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పోలీస్ స్టేషన్ లో దాచిన నగదు ఎలా మాయమైందనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు