శ్రీకాళహస్తిలో ఆర్ఆర్ఆర్ టికెట్ల గొడవ.. థియేటర్లో కొంతమేర ధ్వంసం.

Published : Mar 25, 2022, 08:30 AM IST
శ్రీకాళహస్తిలో ఆర్ఆర్ఆర్ టికెట్ల గొడవ.. థియేటర్లో కొంతమేర ధ్వంసం.

సారాంశం

త్రిపుల్ ఆర్ సినిమా ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం గొడవలకూ దిగుతున్నారు..

శ్రీకాళహస్తి : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన RRR సినిమా విడుదలకు ముందే అభిమానులు గొడవకు దిగారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకుల నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండు వర్గాలు పట్టుబట్టడం, పరోక్షంగా Political leaders హస్తం ఉండడంతో... స్థానిక Theaterల వద్ద గందరగోళ పరిస్థితి కనిపించింది. తొలుత ఓ హీరో అభిమానులు వచ్చి ఎక్కువమొత్తం ticketలు తమకు ఇవ్వాలని పట్టుబట్టగా.. ఇది తెలుసుకున్న మరో వర్గం అభిమానులు గొడవకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారి థియేటర్లో ఓ తలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిల్స్ ను అభిమానులు ధ్వంసం చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.  థియేటర్ వద్ద పరిస్థితి ఇలా ఉంటే చలన చిత్రం విడుదల సందర్భంగా పద్మశాలి పేటకు చెందిన కొందరు ఇద్దరు హీరోల ఫోటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హీరోల ఫోటోలకు రక్త తిలకం దిద్దారు. 

ఇదిలా ఉంటే, మార్చి 21న  ఆర్ఆర్ఆర్ కు సంబంధించి  షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. మార్చి 25న సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ల యజమానులు  తమ థియేటర్లలో ఇనుప మేకులు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసుకుంటున్నారు.  దీనికి కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ జనం కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి ఆతృత పెరిగిపోయింది. మరోవైపు సినిమా ఆన్లైన్ బుకింగ్  టికెట్లు ఇప్పటికే వారం వరకు అయిపోయాయి. చాలా థియేటర్లలో టిక్కెట్లు దొరకడం లేదు. మరోవైపు బెనిఫిట్ షో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టికెట్ ధర 5 వేల వరకు పలుకుతోంది అని సమాచారం.

ఇందులో ఇద్దరు స్టార్ హీరోల నటించడం వల్ల వారివారి ఫాలోయింగ్ లను బట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పలు ఈవెంట్లలో ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తోందంటున్నారు. అంతేకాదు ఆయన మాట్లాడే విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో అరుపులు కేకలు వేయడంతో ప్రాంగణాలు మార్మోగి పోతున్నాయి. మరో వైపు రామ్ చరణ్ అభిమానుల్ని డామినేట్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఓ రకమైన ఈగో చోటుచేసుకుంటున్నాయి. పైకి ఎంత కలిసిపోయామని చెప్పుకుంటున్నా లోలోపల రగిలిపోతున్నారు.  టైం వచ్చినప్పుడు తమ ప్రభావాన్ని చాటుకోవాలని ఉన్నారు. అందుకే ఈ విషయాన్ని ఊహించి చాలా వరకు ఏరియాల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపరేట్గా థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

అయినా చాలా థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండబొవడం లేదు. అందుకే అభిమానుల తాకిడిని అడ్డుకోవడం థియేటర్ల యజమానులకు కత్తి మీద సాములా మారింది. దీంతో నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ సమయంలో అభిమానులు థియేటర్ స్క్రీన్ ఎక్కి గొడవ చేశారు. స్క్రీన్ ను కూడా చించేశారు. దీంతో థియేటర్ కి చాలా నష్టం వాటిల్లింది. ఒక సినిమా హీరోకే పరిస్థితి అలా ఉంటే.. ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాకి.. పైగా థియేటర్లలో పరిస్థితి దారుణంగా ఉండబోతుందని ఊహించిన యజమానులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  దీనిలో భాగంగానే స్క్రీన్ పైకి ఎక్కకుండా, స్కీన్ కి, సీట్లకి కి మధ్య ఉన్న గ్యాప్ లో ఇనుపమేకులు, కంచెలు ఏర్పాటు చేసి.. దాన్ని దాటుకుని తెర వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu