పోలీసులకు చుక్కలు చూపిన రౌడీషీటర్: అంబులెన్స్‌కు నిప్పు

By narsimha lodeFirst Published Sep 16, 2020, 12:33 PM IST
Highlights

ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్ లోనే ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. రౌడీ షీటర్ ను అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డాడు. రౌడీషీటర్ మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.


ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్ లోనే ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. రౌడీ షీటర్ ను అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డాడు. రౌడీషీటర్ మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

సురేష్ అనే రౌడీ షీటర్ 108 నెంబర్ పదే పదే ఫోన్ చేయడంతో అతనిపై 108 సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రౌడీ షీటర్ సురేష్ ను మంగళవారం నాడు రాత్రి అదుపులోకి తీసుకొన్నారు.

పోలీస్ స్టేషన్ లోనే రౌడీ షీటర్ హంగామా చేశాడు. స్టేషన్ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అద్దాలు ధ్వంసం చేయడంతో సురేష్ చేతికి గాయాలయ్యాయి.

దీంతో సురేష్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108ని పోలీసులు పిలిపించారు. అతి కష్టం మీద 108 అంబులెన్స్ లో సురేష్ ను ఎక్కించారు పోలీసులు. ఆసుపత్రికి వెళ్లడానికి సురేష్ నిరాకరించాడు. అంబులెన్స్ లో ఉన్న పత్తికి నిప్పంటించాడు. దీంతో అంబులెన్స్  దగ్ధమైంది. దీంతో భయంతో అంబులెన్స్ సిబ్బంది వాహనం నుండి దిగిపోయారు. అంబులెన్స్ నుండి దిగడానికి సురేష్ నిరాకరించాడు. చనిపోతాను అంటూ అంబులెన్స్ లోనే ఉండిపోయాడు. 

పోలీసులు అతి కష్టం మీద అంబులెన్స్ నుండి సురేష్ ను బయటకు తీసుకొచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. సురేష్ ను  రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు

click me!