విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

Published : Feb 24, 2021, 07:39 AM IST
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

సారాంశం

 తలపై బలంగా గాయం కావడంతో బండ రెడ్డి పడిపోయాడు. అనంతరం కత్తులతో పొడిచి చంపేశారు. తీవ్ర గాయాలు కావడంతో బండ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.  


విశాఖ జిల్లా మద్దెలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద రౌడీ షీటర్ వెంకట్ రెడ్డి అలియాస్ బండ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి 8.30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్డులు, కత్తులతో దారుణంగా దాడి చేసి పొడిచి చంపారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

పాత కక్షల నేపథ్యంలనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి బండరెడ్డి... కేఆర్ఎం కాలనీలోని తన నివాసానికి సమీపంలో రోడ్డు  ఆనుకొని ఉన్న ఫుట్ పాత్ పై కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో ద్విచక్రవాహనంలో ఇద్దరు వ్యక్తులు.. మరో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. మొత్తం నలుగురు వ్యక్తులు బండరెడ్డి పై ఇనుప రాడ్డులతో ఒక్కసారిగా దాడి చేశారు. తలపై బలంగా గాయం కావడంతో బండ రెడ్డి పడిపోయాడు. అనంతరం కత్తులతో పొడిచి చంపేశారు. తీవ్ర గాయాలు కావడంతో బండ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే... గతంలో నేర చరిత్ర ఉన్న బండ రెడ్డి డబ్బులు తీసుకొని నేరాలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. గతంలో రెండు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తనతోపాటే తిరిగిన వ్యక్తులు ఆధిపత్యం కోసం ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బండరెడ్డితో పాటు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులతో తనకు విభేదాలు వచ్చినట్లు తేలుస్తోంది. ఈ హత్య కేసులో ఇద్దరిని అనుమానితులుగా గుర్తించినట్లు సమాచారం. 

బండరెడ్డి పదేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి  ఒక పాప, బాబు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయిన కమాండో | Commando Collapses | Asianet News Telugu
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu