ప్రమాదాలకు ఆ..బూట్లే కారణమా ?

Published : Nov 14, 2017, 07:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రమాదాలకు ఆ..బూట్లే కారణమా ?

సారాంశం

రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదానికి వైసీపీ ఎంఎల్ఏ రోజా కారణం కనిపెట్టేసారు.

రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదానికి వైసీపీ ఎంఎల్ఏ రోజా కారణం కనిపెట్టేసారు. ఆదివారం రాత్రి ఇబ్రహింపట్నం వద్ద జరిగిన ప్రమాదంలో 22 మంది మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు బూట్లు వేసుకుని కృష్ణా హారతిలో పాల్గొనటమే ప్రమాదం జరగటానికి కారణమట. గతంలో కూడా గోదావరి పుష్కరాల సందర్భంలో షూతోనే పుష్కరస్నానం చేసినట్లు తెలిపారు. అందుకే అప్పుడు కూడా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారని గుర్తుచేసారు.

ఇప్పటి నుండైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు చంద్రబాబు బూట్లను వదిలేయాలని రోజా సూచించారు. బూట్లు వదిలేయలేకపోతే పూజలు చేయటం మానుకోమన్నారు. పవిత్ర సంగమం చూడటానికి వచ్చిన వారికి కనీస భద్రత కల్పిచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ నిలదీసారు. జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు బూటు మహిమే కారణమని తాను అభిప్రాయపడుతున్నట్లు రోజా ఎద్దేవా చేసారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్