రూ.4కే భోజనం, రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ : నగరిలో రోజా సేవలు

Published : Dec 17, 2018, 06:09 PM IST
రూ.4కే భోజనం, రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ : నగరిలో రోజా సేవలు

సారాంశం

నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. తననియోజకవర్గమైన నగరిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి అందరిమన్నలను అందుకున్న రోజా తాజాగా మరోసేవా కార్యక్రమంతో అందరి ప్రసంశలు అందుకుంటున్నారు.   

చిత్తూరు: నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. తననియోజకవర్గమైన నగరిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి అందరిమన్నలను అందుకున్న రోజా తాజాగా మరోసేవా కార్యక్రమంతో అందరి ప్రసంశలు అందుకుంటున్నారు. 

నగరి నియోజకవర్గంలోని నగరి మున్సిపాలిటీ పుదుపేటలో తాగునీటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రూపాయలకే తాగునీరు అందించే విషయంలో భాగంగా పనులకు భూమి పూజ చేశారు. 

పట్టణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రోజా తన చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నగరిలో వైఎస్ఆర్ క్యాంటీన్ ను నడుపుతున్నారు. 

నాలుగు రూపాయలకే భోజనం పెడుతూ అన్నదాతగా మారారు. తాజాగా రెండు రూపాయలకే 20 లీటర్ల ఉచిత మినరల్‌ వాటర్‌ను అందించి జలదాతగా మారనున్నారు. మెుత్తంమీద నగరి నియోకవర్గంలో రోజా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజలు ముగ్ధులవుతున్నారు. 

 

ఈ వార్తలను కూడా చదవండి

ఎమ్మెల్యే రోజా ఉదారత:రూ.4లకే భోజనం

స్పీడ్ పెంచిన రోజా, నగరిలోనే మకాం

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్