గాజువాకలో చిత్తుగా ఓడించారు, అందుకే విశాఖపై కసి: పవన్ మీద రోజా

Published : Aug 03, 2020, 08:50 AM ISTUpdated : Aug 03, 2020, 08:51 AM IST
గాజువాకలో చిత్తుగా ఓడించారు, అందుకే విశాఖపై కసి: పవన్ మీద రోజా

సారాంశం

మూడు రాజధానుల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. గాజువాకలో ఓడిపోవడం వల్ల పవన్ కల్యాణ్ విశాఖపై కసి పెంచుకున్నారని రోజా వ్యాఖ్యానించారు.

తిరుమల: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నగరి శానససభ్యురాలు రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో పవన్ కల్యాణ్ ను చిత్తుగా ఓడించారని, అందుకే విశాఖపై పవన్ కల్యాణ్ కసి పెంచుకున్నారా అని ఆమె అన్నారు. 

సోమవారంనాడు రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తుల విలువ పెంచుకునేందుకే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆమె విమర్శించారు. 

Also Read: పాత కక్షలతోనే రాజధాని మార్పు.. కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: పవన్

ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ ను నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధిని చూపించాలని ఆమె అన్నారు. చంద్రబాబు మాయమాటల నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆమె అన్నారు. 

రక్షాబంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చామని, జగనన్న ఉన్నాడనే భరోసా ిలాగో మరో 30, 40 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్ రాఖీ పండుగ సందర్భంగా మరో ముందడుగు వేశారని ఆమె కొనియాడారు. 

"మా అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం కృషి చేస్తున్నారు. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం" అని రోజా అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం