పెనుగంచిప్రోలు బ్రిడ్జిపై నుండి మున్నేరు వరద: తెలంగాణ, ఏపీకి రాకపోకల నిలిపివేత

భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరుకు  వరద పోటెత్తింది. దీంతో  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  పెనుగంచిప్రోలు బ్రిడ్జిపై  నుండి వరద నీరు  ప్రవహిస్తుంది.

Google News Follow Us

జగ్గయ్యపేట: భారీ వర్షాల నేపథ్యంలో  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  పెనుగంచిప్రోలు వద్ద ఉన్న బ్రిడ్జి పై నుండి  మున్నేరు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వత్సవాయి మండలం లింగాల, పెనుగంచిప్రోలు బ్రిడ్జిలపై నుండి మున్నేరు వరద నీరు ప్రవహిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  ఈ వర్షాల కారణంగా  మున్నేరుకు వరద పోటెత్తింది.  మున్నేరు నదికి రెండు  రోజులుగా  వరద ప్రవాహం  పెరుగుతుంది. నిన్న రాత్రి నుండి  పెనుగంచిప్రోలు  బ్రిడ్జిపై నుండి  మున్నేరు వరద నీరు ప్రవహిస్తుంది.

గురువారంనాడు ఉదయానికి  ఈ ప్రవాహం మరింత పెరిగింది.  వంతెనకు రెండు  వైపులా బారికేడ్లు ఏర్పాటు  చేసి  వాహనాల  రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్రిడ్జి మీదుగా  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించవచ్చు.

 జగ్గయ్యపేటకు రావడానికి  నందిగామ మార్గంలో ప్రయాణం చేయాలని  వాహనదారులకు  అధికారులు  సూచిస్తున్నారు. మున్నేరు  వరద తగ్గిన తర్వాతే  ఈ బ్రిడ్జిపై  రాకపోకలను  పునరుద్దరించనున్నారు.బుధవారంనాడు రాత్రి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినందున మున్నేరుకు  మరింత  వరద పెరిగే  అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు.