ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Published : Jul 27, 2023, 08:03 AM ISTUpdated : Jul 27, 2023, 08:07 AM IST
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

సారాంశం

ఏపీలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ మొత్తం తడిసి ముద్దవుతోంది. 

తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అర్ధరాత్రి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.. ఏం జరిగిందంటే ?

అనేక జిల్లాల్లో వానలు పడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఏపీ మొత్తం వానలు కురుస్తున్నాయి. బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.8 సెంటర్లు మీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. కాగా.. ఈ అల్ప పీడన ప్రభావం గురువారం వరకు కొనసాగుతున్నందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్న 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇందులో పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు,  ఎన్టీఆర్, పల్నాడు, కాకినాడ,  బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్