పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా, నలుగురు మృతి...

By SumaBala BukkaFirst Published Jan 14, 2022, 8:29 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బోల్తా పడడంతో నలుగురు మరణించారు.  చేపల లోడ్ తో నారాయణపురం నుంచి దువ్వాడ వెళ్తున్న lorry అదుపు తప్పి బోల్తా పడింది. లారీ కింద పడి నలుగురు కూలీలు మరణించారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని West Godavari Districtలో ఘోర Road accident సంభవించింది. లారీ బోల్తా పడడంతో నలుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చేపల లోడ్ తో నారాయణపురం నుంచి దువ్వాడ వెళ్తున్న lorry అదుపు తప్పి బోల్తా పడింది. లారీ కింద పడి నలుగురు కూలీలు మరణించారు.

ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న Garuda Bus అదుపు తప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదలో పది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారిని సమీపంలోని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలూ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు పంపించారు.

చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న ఆర్టీసీ(RTC) గరుడ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న కాల్వ వంతెనను ఢీకొట్టింది. అర్ధరాత్రి కావడంతో బస్సులో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ఒకరి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తేలింది. నెల్లూరు రూరల్ మండలం బురాన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కాగా, నిర్మల్ జిల్లాలో గతనెలలో బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో భ‌య‌ట‌ప‌డ్డారు. డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ‌హ‌రించ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. పెద్ద ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకోవడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. నిర్మ‌ల్ డిపోకు చెందిన బ‌స్సు.. కామ‌ల్ వెళ్లి వ‌స్తోంది. మామ‌డ మండ‌లం ఆద‌ర్శ‌న‌గ‌ర్ వ‌ద్ద‌కు చేరుకోగానే అదుపుత‌ప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. 

బ‌స్పు వేగంగా ఉండ‌టంతో దానిని అదుపు చేయ‌డం చాలా డ్రైవర్ కు చాలా కష్టతరమైంది. అయినా డ్రైవ‌ర్ కొంత స‌మ‌య‌స్ఫూర్తి ఉప‌యోగించి బ‌స్సు ను కంట్రోల్ చేశాడు. లేక‌పోతే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగి ఉండేది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 60 మందికి వ‌ర‌కు ఉన్నారు. అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో ప‌లువురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. తృటిలో ప్ర‌మాదం తప్ప‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.  

పెరుగుతున్న బస్సు ప్రమాదాలు...
ఇటీవ‌ల బ‌స్సు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. సుర‌క్షిత‌మ‌ని భావించే ఆర్టీసీ బ‌స్సులకే ఇలా జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న చెందాల్సిన విష‌యం. ఇలాంటి ఘ‌ట‌న తెలంగాణ‌లోనే కాదు ఇటీవ‌ల ఏపీలోని చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా బాప‌ట్ల ప్రాంతంలో గురువారం ఓ బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. గుంటూరు జిల్లాలోని కాకుమాను నుండి బాపట్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. గుంతలను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బాపట్ల-నందిపాడు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు ప్ర‌యాణికులు తీవ్ర గాయాల‌య్యాయి. ప‌లువురు స్వ‌ల్ప గాయాల‌తో భ‌య‌ట‌ప‌డ్డారు. 

click me!