ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గరుడ బస్సు అదుపు తప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. నెల్లూరు గ్రామీణ మండలం బురాన్పూర్ వద్ద ఆర్టీసీ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పది మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తుండగా బురాన్పూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమరావతి: నెల్లూరు(Nellore)లో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న గరుడ బస్సు(Garuda Bus) అదుపు తప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదలో పది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారిని సమీపంలోని హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలూ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు పంపించారు.
చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న ఆర్టీసీ(RTC) గరుడ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న కాల్వ వంతెనను ఢీకొట్టింది. అర్ధరాత్రి కావడంతో బస్సులో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ఒకరి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తేలింది. నెల్లూరు రూరల్ మండలం బురాన్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కాగా, నిర్మల్ జిల్లాలో గతనెలలో బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిర్మల్ డిపోకు చెందిన బస్సు.. కామల్ వెళ్లి వస్తోంది. మామడ మండలం ఆదర్శనగర్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్పు వేగంగా ఉండటంతో దానిని అదుపు చేయడం చాలా డ్రైవర్ కు చాలా కష్టతరమైంది. అయినా డ్రైవర్ కొంత సమయస్ఫూర్తి ఉపయోగించి బస్సు ను కంట్రోల్ చేశాడు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మందికి వరకు ఉన్నారు. అందులో ఉన్న ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పెరుగుతున్న బస్సు ప్రమాదాలు...
ఇటీవల బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సురక్షితమని భావించే ఆర్టీసీ బస్సులకే ఇలా జరుగుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇలాంటి ఘటన తెలంగాణలోనే కాదు ఇటీవల ఏపీలోని చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతంలో గురువారం ఓ బస్సు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాలోని కాకుమాను నుండి బాపట్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. గుంతలను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బాపట్ల-నందిపాడు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో భయటపడ్డారు.
ఏపీలోని పశ్చిమ గోదావరిలో జరిగిన ఘటన ఇటీవల ఎక్కడా జరగలేదు. ఈ బస్సు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఎనిమిది మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 43 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పదిమంది మరణించారు. కొండగట్టు బస్సు ప్రమాదం తరువాత ఎక్కువ మంది ఈ ఘటనలోనే చనిపోయారు.