విజయనగరంలో ఘోర ప్రమాదం: బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు చిన్నారులు దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 15, 2022, 07:55 PM IST
విజయనగరంలో ఘోర ప్రమాదం: బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు చిన్నారులు దుర్మరణం

సారాంశం

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

విజయనగరం జిల్లాలో (vizianagaram district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. తెర్లాం మండలం టెక్కలివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు (private school bus) అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనంపై ఐదుగురు ప్రయాణిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ రాజాం ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, ఓ గ్రామంలో జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu