చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెడుతూ బోల్తా పడ్డ ట్రాక్టర్.. ఆరుగురు మృతి..

By SumaBala BukkaFirst Published Dec 8, 2022, 9:23 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వివాహానికి వెడుతున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

పూతలపట్టు : సంతోషంగా వివాహానికి బయల్దేరిన వారు అనంతలోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి ప్రాణాలు హరించింది.  చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళుతుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగినట్లుగా  సమాచారం.

గురువారం పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో ఐరాల మండలం బలిజ పల్లికి చెందిన హేమంత్ కుమార్ వివాహం ఉంది. దీని కోసం దాదాపు 30 మంది హేమంత్ కుమార్ తరఫు బంధువులు బయలుదేరారు. బుధవారం రాత్రి ట్రాక్టర్లో జెట్టిపల్లికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  పూతలపట్టు మండలంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వసంతమ్మ (50), డ్రైవర్ సురేందర్ రెడ్డి .(52), రెడ్డెమ్మ (31), తేజ(25)లతో పాటు.. చిన్నారులు  వినీషా (3),  దేశిక (2)లు కూడా  ఉన్నారు.

‘ఎల్లరి గడ్డలు’ తిని ఒకే కుటుంబంలో ఏడుగురికి అస్వస్థత.. అందులో ఇద్దరు మృతి..

మిగతా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డ్రైవర్ సురేందర్రెడ్డి ట్రాక్టర్ గేర్ ను న్యూట్రల్ చేసి.. వాహనాన్ని వేగంగా నడిపించడం తోనే అదుపు తప్పిందని.. రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దిగిపోయిందని..  బోల్తా పడింది అని తెలిపారు. 

click me!