వలస కూలీలను తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం...ఒకరి మృతి,15 మందికి గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Sep 17, 2020, 11:06 AM ISTUpdated : Sep 17, 2020, 11:08 AM IST
వలస కూలీలను తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం...ఒకరి మృతి,15 మందికి గాయాలు

సారాంశం

ఉంగుటూరు మండలం నాచుగుంట సమీపంలో బెంగళూరుకు చెందిన కాళీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది.   

పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం నాచుగుంట సమీపంలో బెంగళూరుకు చెందిన కాళీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ క్లీనర్ అక్కడికక్కడే  మృతి చెందగా, బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బస్సులోంచి బయటకు తీసి దగ్గర్లోని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్లీనర్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

read more  హెచ్ఐవీ బాధితులమని చెప్పుకుంటూ.. భార్యభర్తల చోరీలు

ప్రమాదానికి గురయిన బస్సు కలకత్తా నుంచి బెంగళూరుకు వెళుతున్నట్లు సమాచారం. వలస కూలీలను తరలిస్తుండగా ఈ బస్సు  ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయడినవారంతా వలస కూలీలే కాబట్టి వారికి ప్రభుత్వమే వైద్యసాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu