కర్నూల్ రోడ్డు ప్రమాదం... మృతిచెందిన నలుగురు చిన్నారుల వివరాలివే

Arun Kumar P   | Asianet News
Published : Dec 15, 2020, 11:02 AM ISTUpdated : Dec 15, 2020, 11:06 AM IST
కర్నూల్ రోడ్డు ప్రమాదం... మృతిచెందిన నలుగురు చిన్నారుల వివరాలివే

సారాంశం

క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగి లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కర్నూలు: జిల్లాలోని సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎం వాహనం ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10)గా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  కర్నూలు-వైఎస్సార్‌ కడప జాతీయ రహదారిపై  ఈ దారుణం చోటుచేసుకుంది. 

క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగి లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా స్థానిక ఎర్రగుంట్ల గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో రహదారిపైన 40 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు చేజ్ చేసి మరి బత్తులూరు వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు