అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు..

Published : Apr 01, 2022, 06:33 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు..

సారాంశం

ఆగి ఉన్న లారీని వెనకనుంచి వచ్చి బస్సు ఢీ కొట్టడంతో ఆనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 15మంది గాయాలపాలయ్యారు. 

అనంతపురం : anantapuram పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఘోర road accident జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని వ్యక్తి అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెల్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఇదిలా ఉండగా మార్చి 28న తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ ఎం‌. వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. 

మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ వన్ డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, ఫిబ్రవరి 7న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ సమీపంలో సాగర్ రహదారిపై road accident చోటు చేసుకుంది. వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా... car అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు death అవ్వగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మాటూరి శ్రీకాంత్ లుగా గుర్తించారు. కారు అతి వేగంతో ఉండడంతో.. వాహనం tyres పేలి పోవడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. postmortem నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.  హైదరాబాద్ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్ లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

కాగా, ఇదిలా ఉండగా, జనవరి 5న ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మందు సేవించి బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్