విజయనగరం: ఇంట్లో రక్తపు మరకలు, డబ్బు మాయం.. మిస్టరీగా మారిన వైద్యుడి అదృశ్యం

Siva Kodati |  
Published : Dec 18, 2021, 04:50 PM IST
విజయనగరం: ఇంట్లో రక్తపు మరకలు, డబ్బు మాయం.. మిస్టరీగా మారిన వైద్యుడి అదృశ్యం

సారాంశం

విజయనగరంలో (vizianagaram) ఆర్ఎంపీ వైద్యుడి మిస్సింగ్ (rmp doctor missing) మిస్టరీగా మారింది. నగరంలోని పల్లె వీధికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఉమా మహేశ్వరరావు (uma maheswara rao) ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు

విజయనగరంలో (vizianagaram) ఆర్ఎంపీ వైద్యుడి మిస్సింగ్ (rmp doctor missing) మిస్టరీగా మారింది. నగరంలోని పల్లె వీధికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఉమా మహేశ్వరరావు (uma maheswara rao) ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఆయన అదృశ్యమైన రోజే ఇంటిలో కుటుంబసభ్యులు  ఎవ్వరూ లేరు. ఇంట్లో కొంత డబ్బు కనిపించకపోవడం, గోడల ఫ్లోరింగ్‌పై అక్కడక్కడ రక్తపు మరకలు వుండటంతో ఉమామహేశ్వరరావు మిస్సింగ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనిని కిడ్నాప్ చేశారా లేక హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు విశాఖ జిల్లా అనంతగిరిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు పరిశీలించారు. అది ఉమామహేశ్వరరావుది కాదని తేల్చారు. ఘటనాస్థలంలో కానీ, ఘటనకు సంబంధించి కానీ.. ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. దీంతో ఆర్ఎంపీ అదృశ్యం మిస్టరీగా మిగిలిపోయింది. ఆయనకి ఎవరైనా శత్రువులున్నారా..?ఇంట్లో కనిపించిన రక్తపు మరకలు ఎవరివీ..? ఉమా మహేశ్వరరావు ఇప్పుడు ఎక్కడున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఆయన కనిపించకుండా పోయిన రోజు రాత్రి చుట్టు పక్కలవారు కూడా ఏ శబ్ధాలు వినలేదని చెబుతున్నారు. ఆర్ఎంపీ ఇంట్లో కనిపించిన రక్తం శాంపిల్స్‌ని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్