‘నా చావుకు నగర పంచాయతీ కమిషనరే కారణం..’ సూసైడ్ నోట్ రాసి ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య.. (వీడియో)

Published : Dec 18, 2021, 12:41 PM IST
‘నా చావుకు నగర పంచాయతీ కమిషనరే కారణం..’ సూసైడ్ నోట్ రాసి ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య.. (వీడియో)

సారాంశం

కమిషనర్ తింటాడని మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి, వాయిస్ మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు ఓ ప్రభుత్యోద్యోగి. ఈ మేరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన చెన్నకేశవ స్థానిక వైద్యశాలలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కమిషనర్ వ్యవహార శైలి మొదట నుండి కూడా విమర్శనాత్మకంగానే ఉంది. 

విజయవాడ : తన చావుకు నగర పంచాయతీ కమిషనర్ కారణం అంటూ సూసైడ్ నోటు, వాయిస్ రికార్డింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే
చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్లో, హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న, K చెన్నకేశవులు అనే వ్యక్తిని, చీమకుర్తి నూతన కమిషనర్ వెంకటరాంరెడ్డి ‘నీవు దళితుడవి నీకు ఉద్యోగం ఎందుకురా’ అని దుర్భాషలాడి కొంత కాలంగా విధుల నుండి తొలగించినందుకు మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి, వాయిస్ మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. 

"

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన చెన్నకేశవ స్థానిక వైద్యశాలలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కమిషనర్ వ్యవహార శైలి మొదట నుండి కూడా విమర్శనాత్మకంగానే ఉంది. విధుల్లో చేరిన వెంటనే నలుగురు ఉద్యోగులను తొలగించడం, మేనేజర్ చేత బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించడం వంటివి చేశాడు. స్థానిక రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని స్థానికులు గుసగుసలాడుకుంటన్నారు.

విశాఖలో సీఎం జగన్ పర్యటన.. కాన్వాయ్ మార్గంలో మెరుపు ధర్నా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?