బాబును ఆలింగనం చేసుకున్న రఘురామ.. అంత ఇష్టమైతే, వైసీపీకి రాజీనామా చేయ్: బాలినేని

Siva Kodati |  
Published : Dec 18, 2021, 03:01 PM IST
బాబును ఆలింగనం చేసుకున్న రఘురామ.. అంత ఇష్టమైతే, వైసీపీకి రాజీనామా చేయ్: బాలినేని

సారాంశం

వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై (raghu rama krishnam raju) మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీద అంత అభిమానం వుంటే.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ (tdp) నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై (raghu rama krishnam raju) మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీద అంత అభిమానం వుంటే.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ (tdp) నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీని పొగడటం మానుకోవాలని మంత్రి బాలినేని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో రాజధాని గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. వైజాగ్ అభివృద్ధి చెందిన నగరం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చెందుతుందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి నిధులు తెచ్చి ఖర్చు చేసే పరిస్ధితి లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. 

కాగా.. అమరావతి (amaravathi) రైతులు శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ముక్తకంఠంతో నినదించాయి. ఈ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాజరు కావడం, ఆయన్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం హైలెట్ అయింది. వైసీపీ తరఫున గెలిచినా.. ఆ పార్టీకే గుదిబండగా మారిన రఘురామ, చంద్రబాబు వేదిక పంచుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read:President rule in AP: ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టండి: వైసీపీ రెబ‌ల్ ఎంపీ డిమాండ్

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలియజేశారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డిది (ys jagan mohan reddy) చేతకాని అసమర్ధ ప్రభుత్వమని.. మహాపాదయాత్రలో పాల్గొన్న వారిపైనా కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీపీఐ, సీపీఎం కూడా అమరావతికి మద్ధతు పలికాయని..  అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతికి మద్ధతు పలికారని చంద్రబాబు గుర్తుచేశారు. తర్వాత అమరావతిపై మడమ  తిప్పారంటూ దుయ్యబట్టారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న తిరుపతిలో ర్యాలీకి విద్యార్ధుల్ని బలవంతంగా తీసుకొచ్చారని.. రాజధానిపై జగన్‌కు కక్ష ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్