
కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం బోళ్ళపాడులో ఓ ఆర్.ఎం.పి డాక్టర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్ఎంపీ డాక్టర్ ఉమామహేశ్వర రావు అతని భార్య మానస ఇద్దరూ విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి వెంటనే డాక్టర్, అతని భార్యను వైద్యం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.