జగన్ అవినీతి రూ. 2 లక్షలకు చేరిందన్న చంద్రబాబు.. రానున్న ఎన్నికల్లో పొత్తులపై మరోసారి క్లారిటీ

By Sumanth KanukulaFirst Published Sep 2, 2022, 1:47 PM IST
Highlights

పేదలకు అన్నం పెట్టాలంటే.. కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్‌ల సంఖ్యను పెంచకపోగా.. ఉన్నవాటిని తొలగించడం దుర్మార్గం అని మండిపడ్డారు. 

పేదలకు అన్నం పెట్టాలంటే.. కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్‌ల సంఖ్యను పెంచకపోగా.. ఉన్నవాటిని తొలగించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్లను కొనసాగిస్తామని చెప్పారు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, పోలవరం, అమరావతిపై ఎన్నికలకు ముందు వైసీపీ అసత్య హమీలు ఇచ్చిందని విమర్శించారు. 

సీఎం జగన్ జగన్ అవినీతి రూ. 2 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. జగన్ ఆస్తులు పెరుగుతున్నాయని.. జనం జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో విధ్వంసం తప్ప విజన్ లేదన్నారు. ఒక్కో కుటుంబంపై రూ. 3.25 లక్షల ఆర్థిక భారం వేశారని మండిపడ్డారు. ఏపీలో సంపద సృష్టించే చర్యలు చేపట్టడం లేదన్నారు. సంపద సృష్టించకపోతే సమస్యలు వస్తాయని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం టీడీపీ ఎన్నో పనులు చేసిందని చంద్రబాబు చెప్పారు. అభివృద్దిలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని ఎన్టీఆర్ అన్నారని చెప్పారు. ఆహార భద్రతకు పునాది వేసిందే ఎన్టీఆర్ అని అన్నారు. రూ. 2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత కల్పించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. బియ్యం రీస్లైకింగ్ చేస్తూ కాకినాడ కేంద్రంగా  విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. దిశ చట్టం, ప్రత్యే పోలీసు స్టేషన్‌లు అని నాటాకాలు ఆడారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామని జగన్ ఎన్నికల ముందు చెప్పారని.. మరి ఏం చేశారని ప్రశ్నించారు.  వైసీపీ ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

పొత్తులపై మరోసారి క్లారిటీ.. 
రానున్న ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. 

click me!