నోటీసులు చంద్రబాబుకు కాదు, రాద్ధాంతమేమిటి : ఆర్కె

By telugu teamFirst Published Jun 30, 2019, 7:20 PM IST
Highlights

లింగమనేని రమేష్ నిర్మించిన గెస్ట్ హౌస్ లోనే ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని లీజుకు తీసుకుని తన నివాసంగా మార్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్కేను ఆశ్రయించారు. 

అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్‌ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగారు. లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే పచ్చ మీడియా, టీడీపీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

లింగమనేని రమేష్ నిర్మించిన గెస్ట్ హౌస్ లోనే ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని లీజుకు తీసుకుని తన నివాసంగా మార్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్కేను ఆశ్రయించారు. 

ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. 

అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు. 

click me!