ఏపి సీఎం సహాయనిధికి రిలయన్స్ సంస్థ భారీ విరాళం

By Arun Kumar PFirst Published Apr 14, 2020, 9:06 PM IST
Highlights
 కరోనా మహమ్మారి విజృంభణ వేళ ఏపి ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ  ఆర్థికసాయాన్ని ప్రకటించింది. 
అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంమొత్తం లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇలా ఓవైపు వైరస్ కోరలుచాస్తుండగా మరోవైపు లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం దెబ్బతింది. దీంతో తమవంతు సాయంగా చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సీఎం సహాయనిధికి విరాళాలు  అందిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో కోవిడ్ –19 నివారణా చర్యల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.5 కోట్ల భారీ విరాళం అందించింది. 

ఏపి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌ద్వారా జమచేసింది.  ఆపత్కాలంలో రాష్ట్రాన్ని ఆదుకోడానికి విరాళం ఇచ్చిన రిలయన్స్ సంస్థకు, యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ సీఎం జగన్‌ లేఖ రాశారు. కరోనా నివారణా చర్యలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్‌.

రిలయన్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కూడా భారీ సహకారం అందించింది. ఏపి మాదిరిగానే రూ.5 కోట్లను విరాళంగా  తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌కు అందించారు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పటికే పీఎం కేర్స్ సహాయ నిధికి రూ.530 కోట్ల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే.    

కోవిడ్ 19 నియంత్రణ చర్యల కోసం ఏపి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు భారీ విరాళాన్ని ప్రకటించాయి. సీఎం సహాయనిధికి ఏకంగా రూ. 200.11 కోట్ల విరాళం ప్రకటించారు. ఉద్యోగుల తరపున విరాళం చెక్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

జిల్లాల మైనింగ్ ఫండ్ నుంచి రూ. 187 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ. 10.62 కోట్లు, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 56 లక్షలు, ఉపాధి హామీ, వాటర్ షెడ్ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 1.50 కోట్లు, సెర్ప్ ఉద్యోగుల విరాళం రూ. 50 లక్షలు అందించారు. 
 
 
click me!