మహేష్ బాబూ, పవన్ కెందుకు మద్దతీయవు

Published : Jan 26, 2017, 05:49 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మహేష్ బాబూ, పవన్ కెందుకు మద్దతీయవు

సారాంశం

మహేష్  బాబు పవన్ కు మద్దతివ్వకపోవడం సరికాదు. డబ్బింగ్ మార్కెట్ మీదుండే ప్రేమ అసలు  మార్కెట్  మీద ఉండఖ్ఖర్లేదా...

 సినిమాలతోనే, అభిప్రాయాల విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ వవాదస్సదుడే. తన అభిప్రాయం చెప్పడంలో వర్మకిి జంకు లేదు. ఎవరో బాధపడ్తారనో, తనను కు వ్యతిరేకులవుతారనో వర్మ బెదిరిపోడు. ముసుగేయకుండా అభిప్రాయాలను వ్యక్తం చేసే నిక్కచ్చి మనిషి వర్మ.

 

‘శ్రీమంతుడు’ తో సినిమాటిక్  సంఘసేవను వెలుగులోకి తీసుకువచ్చిన  మహేష్ బాబు మీద బాణం సంధించారు ఈ  సారి వర్మ.

 

జల్లికట్టు మీద మహేష్ చూపిన  కన్సర్న్ సొంతరాష్ట్రంలో జరుతున్న, అందునా జల్లికట్లు స్పర్తితో నే జరుగుతున్న  ప్రత్యేకహోదా మీద  లేకుండా పోవడమేమిటని ఒక ట్వీట్ విసిరాడు. వర్మ ట్వీట్లు చాలా పదునుగా ఉంటాయి. వదిలాను,గుచ్చుకోకుండా ఉంటాయి, గుచ్చుకుని తీరాలి అనే అక్కసు కూడా  ఆయన ట్వీట్ లో ఉంది. 

 

Why @urstrulyMahesh supporting some Tamil festival culture more than survival problems of AP ? Becos he's not as caring as @PawanKalyan ?

( మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ పడుతున్న అగచాట్ల కంటే తమిళ పండగ సంస్కృతికే మహేష్ మద్దతెక్కువ ఇచ్చారు. ఎందుకంటే,  (దీనిపై)పవన్ కల్యాణ్ కున్నంత ఆవేదన ఆయనకు లేదు)

 

మహేష్ బాబు కు డబ్బింగ్ మార్కెట్ మీదున్నంత యావ అతన్ని సూపర్ స్టార్ని చేసిన అసలు మార్కెట్ కోసం లేక ఆశ్చర్యం అని వర్మ నిర్మొహమాటంగాా చెప్పాడు.

 

 పవన్ పోరాటంతో కలిసిరాని సెలబ్రిటీలు  ఆంధ్రా ద్రోహులవుతారని హెచ్చరించాడు.
 

మహేష్ అభిమానులు  పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపాలని , అలా చేయకపోతే, వారు కూడా  ఆయన (మహేష్) ద్రోహులుగా మిగిలిపోతారు.

 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర సమస్యల కన్నా పవన్ గురించి ఎక్కువగా బేంబేలు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

మహేష్ ఒకవేళ రాజకీయాలేందుకంటే జల్లికట్టుకు  సపోర్ట్  ఎందుకు, పవన్ను  ఎందుకు సపోర్ట్ చేయడంలేదు?'

అంటూ వర్మ మహేష్ ను ఇరుకున పెట్టాడు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?