రోడ్డెక్కి యాగీ చేస్తే కానీ లైసెన్సు రెన్యువల్ కాలేదు

First Published Sep 20, 2017, 4:48 PM IST
Highlights
  • రోడ్డెక్కి యాగీ చేస్తే కానీ అధికారపార్టీ నేతల పనులు కూడా కావటం లేదు.
  • టిడిపి గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉదంతమే తాజా ఉదాహరణ.
  • గడచిన ఏడాదిన్నరగా తన తుపాకి లైసెన్స్ రెన్యువల్ కాలేదంటూ మంగళవారం వంశీ నానా యాగీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
  • వెంటనే ఆయుధాలన్నీ రెన్యువల్ చేస్తున్నట్లు వంశీకి పోలీసు శాఖ నుండి సమాచారం వచ్చింది.

రోడ్డెక్కి యాగీ చేస్తే కానీ అధికారపార్టీ నేతల పనులు కూడా కావటం లేదు. టిడిపి గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉదంతమే తాజా ఉదాహరణ. గడచిన ఏడాదిన్నరగా తన తుపాకి లైసెన్స్ రెన్యువల్ కాలేదంటూ మంగళవారం వంశీ నానా యాగీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2016 ఏప్రిల్లో తన వద్ద ఉన్న ఆయుధాల కాలపరిమితి తీరిపోవటంతో రెన్యువల్ కోసం ఒక పిస్టల్, ఒక రివాల్వార్, ఒక రైఫిల్ ను పోలీసు స్టేషన్లో సరెండర్ చేసారు. అయితే, ఎన్నిసార్లు తిరిగినా వంశీ ఆయుధాల లైసెన్సును రెన్యువల్ చేయటానికి పోలీసులు ఇష్ట పడలేదు.

ఇక లాభం లేదనుకున్న వంశీ తన గన్ మెన్ న్ను కూడా ఉన్నతాధికారులకు సరెండర్ చేస్తున్నట్లు మంగళవారం మీడియాతో చెప్పారు. పనిలో పనిగా ప్రభుత్వ పనితీరుపై నిరసన తెలుపుతూ మండిపడ్డారు. ఎప్పుడైతూ వంశీ నిరసన మీడియాలో ప్రముఖంగా వచ్చిందో విషయం ముఖ్యులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దాంతో వెంటనే ఆయుధాలన్నీ రెన్యువల్ చేస్తున్నట్లు వంశీకి పోలీసు శాఖ నుండి సమాచారం వచ్చింది.

ప్రతిపక్షాలకు చెందిన నేతల ఆయుధాలకు కూడా లైసెన్సులు పొడిగించ కుండా పోలీసులు తొక్కి పెడుతున్న ఘటనలు అనేకమున్నాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి చెఱుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురికావటంలో ఆయుధాల లైసెన్సు రెన్యువల్ చేయకపోవటమే ప్రధాన కారణంగా ఆరోపణలున్న సంగతి అందరికీ తెలిసిందే.

click me!