చంద్రబాబుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఆగ్రహం : ఘాటు లేఖ

By Nagaraju penumalaFirst Published Apr 13, 2019, 6:50 PM IST
Highlights

చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏస్ అదికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పదజాలం సరికాదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పై చంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ లేఖ రాశారు. 

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏస్ అదికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పదజాలం సరికాదంటూ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఏపి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పై చంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ లేఖ రాశారు. సీఎస్ పై చంద్రబాబు నాయుడు వాడిన బాష, వ్యాఖ్యలు సరికావంటూ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను దోషిగా ఎక్కడా న్యాయస్థానాలు తేల్చలేదని స్పష్టం చేశారు. 

మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు అనుసరించిన తీరు సరికాదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు.  

click me!