సదావర్తి భూముల విక్రయాన్ని నాడు వద్దన్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు: వైసీపీపై ఐవైఆర్ ఫైర్

By narsimha lodeFirst Published May 25, 2020, 3:39 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ ఆస్తులను విక్రయించాలని బోర్డు తీసుకొన్న నిర్ణయంపై మాజీ ఐఎఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. 

అమరావతి: తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ ఆస్తులను విక్రయించాలని బోర్డు తీసుకొన్న నిర్ణయంపై మాజీ ఐఎఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. 

దాతలు ఇచ్చిన ఆస్తులను అమ్మాలన్న నిర్ణయం సరైంది కాదన్నారు. ఆలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని ఆయన ఆరోపించారు. దేశంలో రియల్ ఏస్టేట్ వ్యాపారం కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు టీటీడీ ఆస్తులను విక్రయానికి పెడతారా అని ఆయన  ప్రశ్నించారు.

also read:భూముల విక్రయాన్ని నిలిపివేయండి: టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి బోర్డు సభ్యుడు రాకేష్ సిన్హా లేఖ

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో సదావర్తి భూముల విక్రయాన్ని తప్పుబట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు టీటీడీకి దాతలు ఇచ్చిన భూములను ఎలా విక్రయిస్తారో చెప్పాలన్నారు.హిందూ మత పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులను కూడ బహిరంగ మార్కెట్లో విక్రయించడం కూడ సరైంది కాదన్నారు. 

గత ప్రభుత్వంలోనూ ఇప్పుడూ కూడ టీటీడీ కార్యక్రమాలు సీఎంఓ నుండే నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. టీటీడీ బోర్డును పునర్వవ్యస్థీకరించాలని ఆయన కోరారు. దేవుడిపై భక్తి ఉన్న వారిని బోర్డులో సభ్యులుగా చేర్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని కూడ ఆయన కోరారు.తమిళనాడు రాష్ట్రంలోని 23 చోట్ల ఉన్న టీటీడీ ఆస్తులను విక్రయించాలని బోర్డు నిర్ణయం తీసుకొంది. 

click me!