తెలంగాణ, ఏపీ సరిహద్దులో అంబులెన్స్ లపై ఆంక్షలు ఎత్తివేత

By telugu teamFirst Published May 11, 2021, 8:04 AM IST
Highlights

ఏపీ నుంచి తెలంగాణలోకి కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్ లకు లైన్ క్లియర్ అయింది. సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్ ల రాకపై ఆంక్షలు ఎత్తేసింది.

అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో అంబులెన్స్ లకు ఆంక్షలు తొలిగాయి. సోమవారం అర్థరాత్రి ఆంక్షలను ఎత్తేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న అంబులెన్స్ లు తెలంగాణ సరిహద్దులో పోలీసులు ఆపేశారు. దాంతో సోమవారం నాడు సరిహద్దు ప్రాంతంలో రోడ్డుపై అంబులెన్స్ లు బారులు తీరాయి. 

హైదరాబాదులో చికిత్స నిమిత్తం రోగులను అంబులెన్స్ లో హైదరాబాదుకు తరలించే ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ పోలీసులు తెలంగాణ అధికారులతో మాట్లాడారు. దీంతో సాధారణ రోగులను తెలంగాణలోకి అనుమతించడానికి అంగీకరించారు. 

తెలంగాణకు అంబులెన్స్ లను అనుమతించకపోవడంతో తలెత్తిన సమస్య పరిష్కారమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య సంప్రదింపులు జరిగాయని, దీంతో సమస్య పరిష్కారమైందని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే అంబులెన్స్ లను రానీయకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం ఎవరికీ తెలియదు. దీంతో ఏపీ నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నాడంతా రోగులు సరిహద్దుల వద్ద ఆగిపోయాయి. చివరకు తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆంక్షలను ఎత్తేసింది.  రాత్రి 9 గంటల తర్వాత కరోనా రోగులతో వచ్చిన అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించారు. 

ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లడానికి కూడా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లను తవ్వి వాహనాలు రాకుండా చేశారు. తమ రాష్ట్రంలోకి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఒడిశా రాష్ట్రాధికారులు అంటున్నారు. 

click me!